Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలో వందే భారత్ రైలు

modi vandebharat
, ఆదివారం, 8 జనవరి 2023 (09:32 IST)
దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విజయవాడ నగరాల మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. 
 
కాగా, వందేభారత్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంతో నడిచే సెమీ హై స్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందాయి. గత యేడాది భారత రైల్వే శాఖ 7 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ మార్గాల్లో నడుపుతుంది. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
ప్రస్తుతం న్యూఢిల్లీ - వారణాసి, న్యూఢిల్లీ - కత్రా, గాంధీ నగర్ - ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ - అంబ్ అందౌరా, చెన్నై - మైసూరు, బిలాస్ పూర్ - నాగపూర్, హౌరా - న్యూ జల్పాయ్‌గురి స్టేషన్ల మధ్య ఈ రైళ్ళు నడుసున్నాయి. త్వరలోనే సికింద్రాబాద్ - విజయవాడల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దడ పుట్టిస్తున్న కరోనా సబ్ వేరియంట్స్