విడాకుల కోసం కోర్టుకెక్కిన 'రంగేలీ' భామ

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (10:55 IST)
రంగేలి చిత్రంలో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ భామ ఊర్మిళ. ఎనిమిదేళ్ల క్రితం మోడల్ మోసిన్ అక్తర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇపుడు అతనితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టను ఆశ్రయించారు. ఈ మేరకు విడాకుల కోసం ఆమె ముంబై కోర్టులో నాలుగు నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 
 
అయితే ఈ విషయంపై ఊర్మిల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తన కంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన మోడల్ మోసిన్ అక్తారు ఊర్మిళ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని, ఊర్మిళయే కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.
 
బాలీవుడ్‌లో "కర్మ్" మూవీతో బాల నటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఊర్మిళ .. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "అంతం" మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలోనే "అనగనగా ఒక రోజు", "రంగీలా", "సత్య" మూవీలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. కమల్ హాసన్ నటించిన ఇండియన్ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించిన ఊర్మిళ.. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరి ఆ పార్టీలో యాక్టివ్ సభ్యురాలిగా ఊర్మిళ కొనసాగుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments