Webdunia - Bharat's app for daily news and videos

Install App

18.5 టీఆర్‌పి రేటింగ్ సాధించిన `ఉప్పెన`

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:25 IST)
Uppen premier
తెలుగు ప్రేక్ష‌కులు సినిమారంగం ప‌ట్ల ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ప్రేమ‌ చూపిస్తారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితి ఉన్నప్ప‌టికీ `ఉప్పెన` చిత్రాన్ని చూడ‌డానికి ఆడియ‌న్స్ భారీగా థియేట‌ర్స్‌కి వ‌చ్చారు. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ వ‌సూలు చేసింది. నూత‌న న‌టీన‌టులు, నూత‌న ద‌ర్శ‌కుడు క‌లిసి ఈ ఫీట్‌ను సాధించ‌డం ఇది మొద‌టిసారి. ఇండియ‌న్ సినిమాలోనే ఇంత‌వ‌ర‌కూ ఇలా జ‌ర‌గ‌లేదు. 
 
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేశారు. అలాగే దేవిశ్రీ‌ప్ర‌సాద్ సూప‌ర్‌హిట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. శ్యామ్ ద‌త్  బ్రిలియంట్ విజువ‌ల్స్ మ‌రియు బుచ్చిబాబు సానా త‌న రైటింగ్ మ‌రియు డైరెక్ష‌న్‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. మైత్రి మూవీస్ బేన‌ర్‌లో ప్ర‌తి టెక్నీషియ‌న్ చాలా ఇష్ట‌ప‌డి ఈ చిత్రాన్ని చేశారు. అలాగే తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంతో తెలుగు పరిశ్ర‌మ‌లో కూడా మంచి స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నారు. 
 
మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ యొక్క ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్‌తో ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా కనిపించింది. స్క్రిప్ట్ మరియు దర్శకుడిపై నమ్మకంతో వారు  భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఈ చిత్రం ఒక డెబ్యూ హీరో కెరీర్‌లో హెయెస్ట్‌ టీఆర్‌పీరేట్‌ను నమోదు చేసింది. `స్టార్ మా వ‌ర‌ల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌`లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 18.5 రేటింగ్ సాధించింది. 
 
`ఉప్పెన` చిత్రం ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments