Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెగ్యులర్ షూటింగ్ లో ఉపేంద్ర గాడి అడ్డా

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:00 IST)
Kancharla Upendra, Savitri Krishna
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న "ఉపేంద్ర గాడి అడ్డా" చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లోని వివిధ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలియజేస్తూ, "ప్రస్తుతం హీరో హీరోయిన్ ల మీద సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ మొత్తం పూర్తయ్యేవరకు సింగిల్ షెడ్యూల్ జరుపుతున్నాం. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వాటి రికార్డింగ్ జరుగుతోంది" అని అన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, "చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది.  ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. హీరో పాత్ర పక్కా మాస్ అయితే హీరోయిన్ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది" అని చెప్పారు.
"నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తున్నాం. కెరీర్ ను మలుపు తిప్పే చిత్రమవుతుంది" అని  హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ సావిత్రి కృష్ణ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రవీందర్ సన్, సంగీతం: రాము అద్దంకి, ఎడిటింగ్: క్రాంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె నరేశ్ కల్యాణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments