Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంచర్ల ఉపేంద్ర హీరోగా ఉపేంద్ర గాడి అడ్డా ఆరంభం

Advertiesment
Upendra, Savitri Krishna, Kancharla Achyuta Rao
, సోమవారం, 21 ఆగస్టు 2023 (16:25 IST)
Upendra, Savitri Krishna, Kancharla Achyuta Rao
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న "ఉపేంద్ర గాడి అడ్డా" చిత్రం సోమవారం హైదరాబాద్ లో ఆరంభమైంది. అమీర్ పేటలోని సంస్థ కార్యాలయలో పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ నివ్వగా, అతిధిగా విచ్చేసిన నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ,* "మా స్వస్థలం విశాఖపట్నంలో మేము నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక హీరోగా నటిస్తున్న మా అబ్బాయితో వరుసగా తొమ్మిది సినిమాలు తీయాలని సంకల్పించాం. ఇప్పటికే నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇది మా బ్యానర్ లో ఐదవ సినిమా. చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది. దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి, ఈ చిత్రం తీస్తున్నాం" అని అన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ,* ప్రస్తుతం హీరో వరుణ్ సందేశ్ తో నేను దర్శకత్వం వహిస్తున్న "కానిస్టేబుల్" చిత్రం నిర్మాణంలో ఉంది. ఇక ఈ నూతన చిత్రం స్క్రిప్ట్ సైతం చాలా బాగా వచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. హీరో పాత్ర పక్కా మాస్ అయితే హీరోయిన్ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ దమ్ బిర్యాని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత  బావుంటుంది. సెప్టెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తాం" అని చెప్పారు.
 
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ,* మా నాన్న నిర్మాత గా తెరకెక్కుతున్న ఈ సినిమాలన్నీ ప్రతీ నెలకు ఒకటి చొప్పున విడుదల చేస్తాం. నా అభిరుచి, నాన్నకు ఉన్న ఫ్యాషన్ తో సినీ రంగంలోనికి అడుగుపెట్టాం. ఈ సినిమా కూడా నాకు ఒక మంచి సినిమా అవుతుంది" అని అన్నారు.
 
హీరోయిన్ సావిత్రి కృష్ణ  మాట్లాడుతూ,* ఇప్పటికే తెలుగు, కన్నడ బాషలలో సినిమాలుn చేస్తున్నానని, తన కెరీర్ మలుపునకు ఈ సినిమా ఓj కారణం అవుతుందని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రవీందర్ అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె నరేశ్ కల్యాణి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హారర్ బ్యాక్ డ్రాప్ లో ఆశిష్ మూడో చిత్రానికి దిల్ రాజు ఆశీస్సులు