Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ఓ దొంగ : వైజాగ్ నడిబొడ్డున పవన్ కళ్యాణ్ గర్జన

pawankalyan
, గురువారం, 10 ఆగస్టు 2023 (20:16 IST)
జనసే పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వైజాగ్ నడిబొడ్డున గర్జించారు. తాను చేపట్టిన వారాహి యాత్ర మూడో దశ పర్యటనలో భాగంగా, గురువారం ఆయన వైజాగా జగదాంబ సెంటర్ వేదికగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్‌పై మరోమారు నిప్పులు చెరిగారు. విశాఖ జగదాంబ సెంటర్‌లో 25 ఏళ్ల క్రితం 'సుస్వాగతం' సినిమా చేశానని, మళ్లీ ఇప్పుడు ప్రజల కోసం ఇక్కడే వారాహి సభలో మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. సంస్కృతి, సాహిత్యం విశాఖ నేర్పిందన్నారు. 
 
'ప్రాణాలకు తెగించే రాజకీయాల్లోకి వచ్చా. దేనికీ భయపడను. ఈ నేల కోసం ఏదైనా మంచి చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చా. ఎవరి బలిదానంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందో.. వారి విగ్రహాలు ఉండవు.. కానీ, రాష్ట్రాన్ని దోచుకున్న నేతల విగ్రహాలు మాత్రం కనిపిస్తాయి. దోపిడీలు, దౌర్జన్యాలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే.. రాజ్యాంగ విలువలు, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొన్న నాకెంత ఉంటుందో ఊహించుకోగలరా? వైకాపాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టే వరకు, విశాఖ జిల్లాను వైకాపా విముక్త జిల్లాగా చేసే వరకు జనసేన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అప్రమత్తంగా ఉండకపోతే ఐదు సంవత్సరాలు భరించాల్సి ఉంటుంది.
 
ఎన్ని అబద్ధాలు చెప్పి జగన్‌ అధికారంలోకి వచ్చాడు. తెలంగాణలో వైకాపా గుంపు భూముల్ని ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూశా. విశాఖలో రుషికొండను ఎలా తవ్వేశారో మనం చూశాం. ఎర్రమట్టి దిబ్బలు తవ్వేసి రియల్‌ ఎస్టేట్‌ కోసం వాడుకుంటున్నారు. 10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తున్నారు.. విశాఖలో లక్షలాది మంది ఉన్నారు.. ఎందుకు ఆపలేరు? దేశంలో సహజ వనరులు మనందరివి.. జగన్‌ కోసం, వైకాపా ఎమ్మెల్యేల కోసం కాదు. 
 
రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెబితే.. వైకాపా నేతలంతా విమర్శించారు. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించింది. వాలంటీర్లపై నాకు ద్వేషం లేదు. కానీ, మీ ద్వారా డేటా సేకరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. సీఎం జగన్‌.. అన్నా.. అక్కా.. అంటూ అధికారులను సంబోధిస్తుంటారు. సీఎం.. అన్నా అని పిలిచాడని పొంగిపోయి తప్పులు చేస్తే ఆ తర్వాత పరిణామాలకు మీరే బాధ్యులవుతారు అని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో కొత్త వార్షిక రీఛార్జ్ ఆఫర్ ప్రయోజనాలేంటి?