Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంధ‌కారం

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (23:00 IST)
ప్యాష‌న్ స్టూడియోస్, ఓ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర‌, సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మాత‌లుగా వి విజ్ఞ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అంధ‌కారం. స్వామీరారా, పిజ్జా వంటి థ్రిల్ల‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన పూజా రామ‌చంద్ర‌న్ కీల‌క పాత్ర‌లో ఈ సినిమా తెర‌కెక్కింది.
 
పూజా రామచంద్ర‌న్‌తో పాటు అర్జున్ దాస్, వినోత్ కిష‌న్, కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్ కూడా లీడ్ రోల్స్‌లో న‌టించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ సూప‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ని ప్ర‌ముఖ ఓటిటి నెట్‌ఫ్లిక్స్ వారు డైరెక్ట్ టు ఓటిటి రిలీజ్ ప‌ద్థ‌తిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 24, 2020 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంద‌ని నిర్మాత‌లు సుదాన్, ప్రియ అట్లీ తెలిపారు.
 
ఈ నేప‌థ్యంలోనే అంధ‌కారం చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ అంధ‌గార‌మ్ టీజ‌ర్‌ని ప్ర‌ముఖ తిమ‌ళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ విడుద‌ల చేయ‌డం విశేషం. టీజ‌ర్ మొత్తాన్ని స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో, థ్రిల్లింగ్ సౌండ్‌తో డిజైన్ చేయడంతో ఆడియెన్స్‌కి సినిమా మీద మ‌రింత ఉత్కంఠ క‌లుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని సుదాన్ తెలిపారు.
 
న‌టీన‌టులు: పూజా రామ‌చంద్ర‌న్, అర్జున్ దాస్, వినోధ్ కిష‌న్, కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్, సాంకేతిక వ‌ర్గం: బ్యానర్ - ప్యాష‌న్ స్టూడియోస్, ఓ 2 పిక్చ‌ర్స్, స‌మ‌ర్ప‌ణ - అట్లీ, నిర్మాత‌లు - సుదాన్ సుంద‌ర‌మ్, ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర‌, మ్యూజిక్ - ప్ర‌దీప్ కుమార్
కెమెరా - ఎమ్ ఎడ్విన్ స‌కేయ్, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం - వి విజ్ఞారాజ‌న్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments