Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''రాములో రాములా''తో అదరగొట్టాడు.. ఇప్పుడు చుక్కల చిన్ని అంటూ..?

''రాములో రాములా''తో అదరగొట్టాడు.. ఇప్పుడు చుక్కల చిన్ని అంటూ..?
, గురువారం, 5 నవంబరు 2020 (20:16 IST)
Chukkala Chunni
'అల వైకుంఠపురములో' చిత్రంలోని రాములో రాములా సాంగ్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్‌ని పాడింది అనురాగ్‌ కులకర్ణి. ఇప్పుడు ఆయన పాడిన మరో చిత్రంలోని సాంగ్‌ తాజాగా విడుదలైంది. మొదటి చిత్రం 'రాజావారు రాణిగారు' చిత్రంతో మంచి గుర్తింపును పొందిన కిరణ్‌ అబ్బవరం హీరోగా, 'టాక్సీవాలా' ఫేమ్‌ ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌గా శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం'. 
 
దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన చుక్కల చిన్ని అనే లిరికల్‌ సాంగ్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో నిర్మాతలు ప్రమోద్‌, రాజు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి ఆదరణ లభించింది. తాజాగా కిరణ్ నటించిన రెండో సినిమా అయిన ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం నుంచి సాంగ్ రావడం పట్ల నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
చుక్కల చిన్ని పాట విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ''కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం రాజావారు రాణి గారు మాకు చాలా బాగా నచ్చింది. ఈ లాక్‌డౌన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో మోస్ట్ వ్యూవర్‌షిప్ వున్న టాప్ 5 చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఉందంటే.. మా హీరో కిరణ్ ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాడో తెలుస్తోంది. కిరణ్ రెండవ చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం మేము చేయటం చాలా ఆనందంగా వుంది.'' అన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం..?