Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరచాలనాలు వద్దు.. కరోనాపై ఉపాసన, సుమ సూచనలు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (13:54 IST)
కరచాలనాలు మానేస్తేనే కరోనా వ్యాపించదని వైద్యులు చెప్తున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని కోరుతున్నారు. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అపోలో ఫౌండేషన్ నిర్వాహకురాలు ఉపాసన కొణిదెల తెలిపారు. వీడియో ద్వారా ఆమె కొన్ని జాగ్రత్తలు, సూచనలు చేశారు. 
 
కరోనా వైరస్ వల్ల జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు. ఈ వైరస్‌ను యాంటీ బయాటిక్స్ అంతమొందించలేవని స్పష్టం చేశారు. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దని సూచించారు.
 
కరోనా నేపథ్యంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వండని మాంసం తినొద్దని ఉపాసన సూచించారు. 'దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే మాస్కు ధరించాలని కోరారు. దగ్గు, తుమ్ము లాంటివి వచ్చే వ్యక్తి నుంచి 3 అడుగుల దూరం ఉండాలని చెప్పారు. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి, హ్యాండ్ సానిటైజర్‌ను వెంట ఉంచుకోవాలని ఉపాసన కోరారు.
 
అలాగే యాంకర్ సుమ కూడా కరోనా సోకకుండా వుండేందుకు సూచనలు చెప్పారు. జ్వరం, తలనొప్పి, దగ్గు ఉంటే కరోనా వచ్చినట్లు కాదని, ముందు జాగ్రత్తగా పరిశోధనలు చేసుకోవాలన్నారు. భారతీయ సంస్కృతిలో కరోనా వైరస్ అంత త్వరగా వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. 
 
మనం ఎవరైనా కనిపిస్తే నమస్కారం చేస్తామని, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కుంటామని, అలాగే వంటల్లో పసుపు వాడుతాం అనే విషయన్ని సుమ గుర్తు చేశారు. పరిశుభ్రత పాటిస్తే కరోనా దరిచేరే అవకాశంలేదన్నారు. కరచాలనం వద్దని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments