Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (14:05 IST)
Surya
హీరో సూర్య తాజాగా కంగువ సినిమాతో రానున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. ఆల్రెడీ తెలుగులో భారీగా ప్రమోషన్స్ చేసుకున్నాడు. తాజాగా బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో బాలయ్య సూర్య కలిసి నవ్వించారు.. అలానే ఏడ్పించారని కూడా చెప్పాలి. కంగువా ముచ్చట్ల కన్నా.. పర్సనల్ ముచ్చట్లతోనే బాలయ్య సూర్య సందడి చేశారని తాజాగా వదిలిన ప్రోమోను చూస్తే అర్థమైపోతుంది. 
 
"నేను సింహం అయితే.. తాను సింగం.. నేను లెజెండ్ అయితే అతను రోలెక్స్ అంటూ ఇలా సూర్యను ఎలివేట్ చేసేశారు బాలయ్య. అలాగే అన్నదమ్ములైన సూర్య, కార్తీల మధ్య గల సంబంధాన్ని, వారి ప్రేమను బయటపెట్టే ప్రయత్నం చేశారు. కార్తీ, సూర్య, బాలయ్య ముచ్చట్లు ఎపిసోడ్‌కే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. 
 
ఇక సూర్య పెట్టిన ఫౌండేషన్, ఉచిత విద్య, పిల్లల వీడియోలు వేయించి బాలయ్య అందరినీ ఎమోషనల్ చేశాడు. ఇక చిన్న పిల్ల మాటలకు సూర్య కంట తడి పెట్టేశారు. అలాగే మొదటి క్రష్ ఎవరో చెప్పాలని కోరారు. కానీ సూర్య వద్దు సర్ ఇంటికి వెళ్లాలని.. గొడవలు అవుతాయని ఫన్ చేశారు. ఇంకా జ్యోతిక లేని జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య భావోద్వేగానికి లోనైయ్యారు. మానవత్వం వున్న మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం వుందన్నారు. 
 
ఇక బాలయ్య కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడిగారు. ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పడంతో కార్తీని సూర్య "నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా" అంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో కంగువ నటులు బాబీ డియోల్, దర్శకుడు శివ పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments