Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగువ లో నాయకుడి గొప్పదనాన్ని తెలిపే సూర్య ఎంట్రీ సాంగ్ రిలీజ్

Advertiesment
surya nayaka song

డీవీ

, బుధవారం, 30 అక్టోబరు 2024 (15:37 IST)
surya nayaka song
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.  ఈ రోజు 'కంగువ'  సినిమా నుంచి 'నాయకా..' లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
 
'నాయకా..' లిరికల్ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా..రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, శెంబగరాజ్, నారాయణ్ రవిశంకర్, గోవింద్ ప్రసాద్, శిబి శ్రీనివాసన్, ప్రసన్న అభిశేష, సాయిశరణ్, విక్రమ్ పిట్టి, అభిజిత్ రావ్, అపర్ణ హరికుమార్, సుస్మిత నరసింహన్, పవిత్ర చారి, లవిత లోబో, దీప్తి సురేష్, లత కృష్ణ, పద్మజ శ్రీనివాసన్ పాడారు. 'నాయకా మా నాయకా నాయకా మా నాయకా..ధీర ధీర కదన విహార ధీర రారా అగ్ని కుమారా...' అంటూ తమ నాయకుడి గొప్పదనాన్ని పొగుడుతూ తెగ ప్రజలు పాడుకునే పాటగా ఈ సాంగ్ ను డిజైన్ చేశారు.
 
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్కీ భాస్కర్ ప్రీమియర్ల ఆదరణతో షోలు కూడా పెంచాము : నిర్మాత సూర్యదేవర నాగవంశీ