Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె సెలెక్షన్ - మాజీ ఎయిర్‌హోస్ట్‌ను పెళ్లాడిన దిల్ రాజు..

Webdunia
సోమవారం, 11 మే 2020 (13:25 IST)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మరోమారో ఓ ఇంటివాడయ్యారు. గత 2017లో ఆయన భార్య అనిత అనారోగ్య కారణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఆయన ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తన కుమార్తెకు హన్షితకు వివాహం చేసిన దిల్ రాజు.. తాను మాత్రం పెళ్లి చేసుకోలేదు.
 
అయితే, తన కుమార్తె హన్షితతో పాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. పైగా, రెండో పెళ్లి కోసం వధువును కూడా తన కుమార్తె హన్షితనే ఎంపిక చేసింది. ఆమె దిల్ రాజుకు కూడా నచ్చారు.
 
ఫలితంగా ఆదివారం రాత్రి 11 గంటల ముహూర్తానికి నిజామాబాద్ జిల్లా నార్సింగపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో దిల్ రాజు రెండో పెళ్లి కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. అదీ కూడా అంతర్జాతీయ మాతృదినోత్సవం జరగడం యాదృచ్ఛికం కావడం గమనార్హం.
 
మరోవైపు, దిల్ రాజు పెళ్లి చేసుకున్న రెండో భార్య ఓ మాజీ ఎయిర్‌హోస్ట్. పైగా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ. అయితే, ఆమె పేరు, ఊరుతో పాటు ఇతర వివరాలు మాత్రం తెలియాల్సివుంది.
 
కాగా, ప్రస్తుతం దిల్ రాజు రెండో పెళ్లి వివాహ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక సినీ సెలెబ్రిటీలు దిల్ రాజు దంపతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments