Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్ ద్విభాషా చిత్రంలో ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (17:57 IST)
Maria Raboshapka
ప్ర‌ముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. `జాతి రత్నాలు` బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత ప్ర‌ముఖ దర్శకులలో ఒకరిగా మారారు అనుదీప్.  తెలుగులో ఇటీవ‌లే `వరుణ్ డాక్టర్`తో విజయం పొందిన‌ శివకార్తికేయన్ కోసం స‌క్సెస్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.
 
ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రేనియన్ న‌టి మరియా ర్యాబోషప్కా ఎంపికైంది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ‌లు సోమ‌వారంనాడు ప్ర‌క‌టించాయి. ఆమె ఇప్పటికే రెండు ఉక్రేనియన్ సినిమాల్లో నటించింది అంతేకాక‌ ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ స్పెషల్ ఆప్స్‌లో ప్ర‌ధాన పాత్ర పోషించింది. మ‌రియాకు సంబంధించిన నేడు విడుద‌ల చేసిన పోస్టర్‌లో ఆమె అందంగా కనిపిస్తోంది.
 
ఈ చిత్రం శివకార్తికేయన్‌కు 20వ చిత్రం. #SK20 విభిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌బోతోంది. ఈ చిత్ర కథ బేక్‌డ్రాప్ పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు,  సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.
 
తారాగణం: శివకార్తికేయన్, సత్యరాజ్, మరియా ర్యాబోషప్క
 
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అనుదీప్ కె.వి
సంగీత దర్శకుడు: ఎస్ థమన్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు,  సురేష్ బాబు
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్
సహ నిర్మాత: అరుణ్ విశ్వ
PRO: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments