Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు రూములో వచ్చే ఉద్వేగం మూవీ సక్సెస్ కావాలి: రామ్ గోపాల్ వర్మ

డీవీ
సోమవారం, 11 నవంబరు 2024 (16:30 IST)
Udvegam- trigun
త్రిగున్ ప్రధానపాత్ర పోషించగా, దీప్సిక కథానాయికగా నటించిన చిత్రం ఉద్వేగం. శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. 
 
ఈ చిత్రం టీజర్ ను డైరెక్టర్ ఆర్జీవి ఆవిష్కరించారు. చిత్రం టీజర్ చూస్తుంటే ఎంతో కష్టపడి తీశారని, అలాగే యాక్టర్ త్రిగున్ కు 25వ చిత్రం కావడం విశేషమని ఆర్జీవి అన్నారు. అంతేకాక కోర్టు రూములో వచ్చే చిత్రాలు చాల తక్కువ అని, ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలని తన కోరుకుంటున్నట్లు ఆర్జీవి అన్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఏంతో ప్రేక్షక ఆదరణ పొందింది. 
 
2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో మరో సినిమా  ఇదే కావడం విశేషం. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది అని చిత్ర బృందం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి... తొలి పైప్ గ్యాస్ సిటీగా...

మరింతగా బలపడిన అల్పపీడనం.. నేడు ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments