Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమటిరెడ్డిని రావద్దన్న సినీపెద్దలు - సినీకార్మిలకు ఇచ్చిన హామీలు నీటిమూటలేనా?

డీవీ
సోమవారం, 11 నవంబరు 2024 (16:09 IST)
RK Goud, Komatireddy Venkata Reddy
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. కాగా, ఈ ఫంక్షన్ కు మంత్రిని వెళ్ళవద్దని చెప్పారట. కానీ ఆయన తెలంగాణకు చెందిన ఆర్.కె.గౌడ్ తో వున్న సాన్నిహిత్యం వచ్చినట్లు తెలుస్తోంది.
 
వేడుకలో తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా ఉన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం రెంట్ తీసుకుని నిర్వహిస్తున్నాం. ఫిలింనగర్ లో 800 గజాల స్థలం ఇప్పించగలరని కోరుతున్నాం. ఆ స్థలంలో సొంత కార్యాలయం నిర్మించుకుంటాం. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు  30 సంవత్సరాల పైన అవుతుంది. 40 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఎనిమిది సినిమాలో డైరెక్షన్ చేయడం జరిగింది, అలాగే 250 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం చేశాను.
 
మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి కూడా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదు, కాబట్టి మా చాంబర్లో ఉన్న కార్మికులందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నాను. మా తెలంగాణలో ఉండే కొందరు బడా నిర్మాతలు మంత్రి గారి పి ఏ లకు ఫోన్ చేసి  మంత్రిగారిని ఫంక్షన్కు రాకుండా చూసుకోండి అని చెప్పారు, అయినా ఎవ్వరిని లెక్కచేయకుండా మంత్రిగారు మా ప్రోగ్రాంకు రావడం నిజంగా చాలా చాలా సంతోషం. రావడమే కాదు మేము అడిగిన కోరికలన్నీ తీరుస్తానని చెప్పారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
 
పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. కానీ చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ హైక్ అవసరం లేదు. థియేటర్స్ లో చిన్న సినిమా రిలీజ్ కు క్యూబ్, యూఎఫ్ వో వంటి కంటెంట్ ప్రొవైడర్స్ కు తమిళనాట 2500 ఉంటే మన దగ్గర 10 వేలు వసూలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు మద్ధతుగా ఉన్నారు. నేను గతంలో నిరాహార దీక్ష చేస్తే 3 వేల వరకు ఈ ఛార్జీలు తగ్గించారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి. అలాగే చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు. మా సభ్యుల్లో కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని కోరుతున్నా అన్నారు.
 
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ ఎవరో ఐదారుగురు పెద్ద వారిదే కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ. అందరికీ నటన రాదు. వచ్చిన కళాకారులకు మనం సపోర్ట్ గా నిలబడాలి. మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. నా దగ్గరకు థియేటర్స్ ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా వారికి నా సహకారం అందిస్తున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ లో మన తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తాం. మీకు ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం తరుపున గానీ, వ్యక్తిగతంగా నా తరుపున గానీ చేస్తానని హామీ ఇస్తున్నా అన్నారు.
 
కాగా, ఇప్పటికే చిత్రపురికాలనీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనీ, దానిపై మీరు చర్య తీసుకోవాలని సినీకార్మిక సంఘాలవారు కోమటిరెడ్డిగారిని కలవడం జరిగింది. అందులో కొత్తగా ట్విన్ టవర్స్ పేరుతో ప్రస్తుత చిత్రపురి సొసైటీ భవనాలు కట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే అది చెరువు పక్కనే వుండడంతోపాటు, అసలు కార్మికులకంటే బయట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా రేట్లు వుండడంతో చిత్రపురి పోరాటసమితి కోర్టుకు వెళ్ళడంతో భవననిర్మాణాలు ఆగిపోయాయి. మరి ఇలాంటి దానిలో సినీకార్మికులకు ఇల్లుఎలా ఇస్తారని పోరాటసమితి పేర్కొంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments