Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించిన రాజా ది రాజా చిత్రం

Advertiesment
Clap by Komatireddy Venkata Reddy

డీవీ

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (16:02 IST)
Clap by Komatireddy Venkata Reddy
రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం "రాజా ది రాజా". మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలు. ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవి బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
 
webdunia
Raja Di Raja movie opening
ఈ సందర్భంగా దర్శకుడు మణికాంత్ గెల్లి మాట్లాడుతూ -తెల్లవారితే గురువారం సినిమా తర్వాత నేను డైరెక్షన్ చేస్తున్న మూవీ ఇది. ఒక మంచి లవ్ స్టోరిని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిస్తున్నాను. నేచర్ తో రిలేట్ అయిన ఉన్న ఒక పాయింట్ కథలో ఉంటుంది. పూర్తి కమర్షియల్ మూవీ కాకపోయినా..కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ఇవాళ మా మూవీ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, దర్శకులు రవిబాబు, కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్  ను హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.  అన్నారు.
 
ప్రొడ్యూసర్ చాణక్య అద్దంకి మాట్లాడుతూ - కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ మూవీ ఓపెనింగ్ మాదే.  రాజా ది రాజా సినిమాను నేచర్ కు దగ్గరగా ఉన్న ఒక పాయింట్ తో నిర్మిస్తున్నాం. మంచి మూవీ అవుతుంది. ఫ్రెండ్లీగా ఉండే టీమ్ కుదిరింది. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి మే జూన్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. కెమెరా స్విచ్ఛాన్ రవిబాబు చేశారు. గౌరవ దర్శకత్వం కృష్ణారెడ్డి గారు చేశారు. మంత్రి కోమటిరెడ్డి గారు క్లాప్ ఇచ్చారు. అన్నారు
 
హీరో రుత్విక్ కొండకింది మాట్లాడుతూ - ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నాం. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. ఇవాళ మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మీడియా నుంచి కూడా సపోర్ట్ కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ విశాఖ దిమాన్ మాట్లాడుతూ - హీరోయిన్ కావాలనేది నా డ్రీమ్. ఆ కల రాజా ది రాజా సినిమాతో నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందుకు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నా రోల్ చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ తో నేను ఎలా లవ్ లో పడ్డాను. మీరూ అలాగే లవ్ చేస్తారు. సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
నటీనటులు - రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్, విష్ణు ఓ ఐ, రోహిణి, పృథ్వీ, మురళీ శర్మ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిపుస్తకం తరువాత నా కెరీర్ లో ఆ స్థాయి చిత్రం లగ్గం : డా రాజేంద్రప్రసాద్