Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయభాను రోజుకి రూ.2 లక్షలు కావాలట.. బిగ్‌బాస్-3లో..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:39 IST)
ఒకప్పుడు యాంకర్‌గా, నటిగా బుల్లితెరలో ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసింది. ఆ తర్వాత పెళ్లై పిల్లలు పుట్టాక కాస్త విరామం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి భాను రెడీ అయిపోతోంది. అందులోనూ స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోలో పాల్గొననుందని సమాచారం. 
 
అందుకే బిగ్‌బాస్ సీజన్ 3కి వినిపిస్తున్న కంటెస్టెంట్‌ల పేర్ల లిస్టులో భాను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కంటెస్టెంట్‌లు వీక్‌గా ఉంటే కార్యక్రమం బోర్ కొడుతుంది. అందుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల కోసం ఎంత మొత్తాన్నైనా చెల్లించి వారిని అందులో పాల్గొనేలా చేయాలని స్టార్ మా భావిస్తోంది.
 
ఉదయభాను ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా ప్రేక్షకులు తనని రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో రోజుకి రూ.2 లక్షలు ఇచ్చి మరీ ఆమెను తీసుకుంటున్నారట షో నిర్వాహకులు. అంటే వందరోజులకు గానూ రోజుకి రూ.2లక్షల చొప్పున రూ.2 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. 
 
బిగ్‌బాస్ సీజన్‌లో ఇదే అత్యధిక పారితోషికం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగిలిన కంటెస్టెంట్‌లు సైతం ఉదయభాను మాదిరిగానే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తే షో నిర్వాహకులు ఏమి చేస్తారని ప్రేక్షకులు చెవులుకొరుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments