తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం వేయనున్నారన్నది ఆ వార్త. దీనికి సంబంధించి ఓ బ్యాంకు నోటీసు కూడా జారీచేసింది. ఈ నోటీసు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది
తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం వేయనున్నారన్నది ఆ వార్త. దీనికి సంబంధించి ఓ బ్యాంకు నోటీసు కూడా జారీచేసింది. ఈ నోటీసు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది.
బాలచందర్‌కు చెందిన కవితాలయా సంస్థ పలు టీవీ సీరియల్స్ నిర్మించింది. వీటిలో కొన్ని మంచి ప్రజాదారణ పొందగా, మరికొన్ని నష్టాలను తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ ఆయన సీరియల్స్ తీయడం మానలేదు. ఈ నేపథ్యంలో కవితాలయ నిర్మించిన ఓ టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారు.
2015లో సీరియల్ నిర్మాణ పనులను రద్దు చేసి, డిజిటల్ నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లిస్తూ వచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి చర్యలు తీసుకున్నారు. ఇంతలోనే యూకో బ్యాంకు బాలచందర్ ఆస్తులను వేల వేయనున్నట్టు నోటీసు పంపించింది. ఈ వార్త వేలాదిమంది బాలచందర్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.