Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి శిక్ష పడింది... రెండేళ్ళ జైలు

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షిపై చేయి చేసుకుని ఆ తర్వాత అధికార బలంతో ఆ కేసు నుంచి తప్పించుకున్న అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది.

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి శిక్ష పడింది... రెండేళ్ళ జైలు
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:04 IST)
కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షిపై చేయి చేసుకుని ఆ తర్వాత అధికార బలంతో ఆ కేసు నుంచి తప్పించుకున్న అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది. ఈయనకు మూడు కేసుల్లో రెండేళ్ళ జైలుశిక్ష విధిస్తూ భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిని సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, గత ఎన్నికల్లో చింతమనేని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన 2011లో గ్రామసభలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. 
 
ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అలాగే, గన్‌మెన్‌ను కొట్టిన కేసులో 6 నెలలు, రచ్చబండ వేదిక దగ్గర గొడవకు కారణమైనందుకు మరో ఆరు నెలలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో ఆయన అనుభవించాలని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్