Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

డీవీ
శుక్రవారం, 24 మే 2024 (16:43 IST)
Srinivas Bellamkonda
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రివిల్ చేసిన ఈ సినిమా టైటిల్ 'టైసన్ నాయుడు' గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈరోజు, మేకర్స్ రాజస్థాన్‌లో సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను ప్రారంభించారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన బ్రెత్ టేకింగ్ యాక్షన్ బ్లాక్‌ను టీమ్ షూట్ చేస్తోంది. ఇది సినిమాలో మెయిన్ హైలైట్‌లలో ఒకటి. ఈ 2 వారాల లెన్తీ షెడ్యూల్‌లో మేకర్స్ కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేయనున్నారు. ఈ సబ్జెక్ట్‌పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు.
 
గ్లింప్స్‌లో చూపిన విధంగా, బెల్లంకొండ సినిమాలో మాస్ లుక్‌లో ఉన్నారు. పోలీస్ గా మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు సాగర్ కె చంద్ర.
 
టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ముఖేష్ జ్ఞానేష్/అనిత్ డీవోపీ వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments