Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో వ్యభిచారం రాకెట్... కన్నడ టాప్ హీరోయిన్లు ఇద్దరు... మెహ్రీన్ వద్ద విచారణ

చికాగో వ్యభిచారం రాకెట్ టాలీవుడ్ హీరోయిన్లకు పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతోంది. హైదరాబాద్ నుంచి ఏ హీరోయిన్ అమెరికాకు వెళ్లినా వారికి పోలీసుల విచారణలు పలుకరిస్తున్నాయి. తాజాగా మెహ్రీన్ వద్ద పోలీసులు విచా

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (11:13 IST)
చికాగో వ్యభిచారం రాకెట్ టాలీవుడ్ హీరోయిన్లకు పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతోంది. హైదరాబాద్ నుంచి ఏ హీరోయిన్ అమెరికాకు వెళ్లినా వారికి పోలీసుల విచారణలు పలుకరిస్తున్నాయి. తాజాగా మెహ్రీన్ వద్ద పోలీసులు విచారణ చేశారు. టాలీవుడ్ హీరోయిన్ కావడంతో అమెరికాలోని ఓ విమానాశ్రయంలో మెహ్రీన్‌ను అరగంట పాటు విచారించారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. చికాగో వ్యభిచారం రాకెట్ ఉదంతం కలకలం రేపిన నేపథ్యంలో.. తన తల్లిదండ్రులను కలిసేందుకు కెనడాలోని వాంకూవర్ నుంచి అమెరికాకు వెళ్తుండగా, అమెరికాలోని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు తనను ఆపేశారని తెలిపింది.
 
తాను టాలీవుడ్ హీరోయిన్ కావడంతో అరగంట పాటు తనను విచారించారని మెహ్రీన్ చెప్పింది. దీంతో షాక్‌కు గురయ్యానని.. టాలీవుడ్ నిర్మాత అమెరికాలో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నాడనే విషయం ఇంతవరకు తెలియదని, ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పాకే తెలిసిందని వెల్లడించారు. అమెరికాకు వచ్చే ప్రతి నటిని విచారిస్తున్నట్టు అధికారులు చెప్పారని తెలిపింది.
 
అమెరికాలోని చికాగో కేంద్రంగా మోదుగమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ సాగించిన వ్యభిచారం రాకెట్‌లో భాగమైన తెలుగు హీరోయిన్లపై అమెరికా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ నిర్వహించిన వ్యభిచారం రాకెట్‌లో భాగమైన టాలీవుడ్ హీరోయిన్లను ఆరు గంటల పాటు అమెరికా అధికారులు ప్రశ్నించగా, వీరు అప్రూవర్లుగా మారినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లు ఈ వ్యభిచారం ఉచ్చులో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పట్టుబడ్డ కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...

తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?

చెన్నై మసాజ్ సెంటరులో వ్యభిచారం... పోలీసులు వెళ్లి చూడగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments