Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీట్‌గా పిలిచిందని చాన్స్ తీసుకున్నారో.. గుండు కొట్టిస్తారు జాగ్రత్త

తీయటి గొంతులో ఎవరైనా పిలిస్తే దారిన పోతున్నా సరే.. ఏ మానవుడైనా చలించకుండా, స్పందించకుండా ఉంటాడా. మనిషి బలహీనతనే పునాదిగా చేసుకుని ఒక జంట కొత్తరకం దోపిడీకి తెరతీసి పట్టుబడింది.

Advertiesment
స్వీట్‌గా పిలిచిందని చాన్స్ తీసుకున్నారో.. గుండు కొట్టిస్తారు జాగ్రత్త
హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (07:46 IST)
మాదక ద్రవ్యాలకు లోనయితే ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయో గత కొద్ది రోజులుగా పత్రికలు, చానళ్లూ వార్తలమీద వార్తలను ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి. కానీ మత్తుమందుల వ్యసనాలకు లోనయిన సాధారణ వ్యక్తులు కూడా కొత్తరకం దొంగతనాలకు ఎలా  పాల్పడుతున్నారో, ఎలాంటి దొంగ తెలివితేటలు ప్రదర్సిస్తూ జనం గుండు కొడుతున్నారో తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. తీయటి గొంతులో ఎవరైనా పిలిస్తే దారిన పోతున్నా సరే.. ఏ మానవుడైనా చలించకుండా, స్పందించకుండా ఉంటాడా. మనిషి బలహీనతనే పునాదిగా చేసుకుని ఒక జంట కొత్తరకం దోపిడీకి తెరతీసి పట్టుబడింది.
 
విషయాల్లోకి వస్తే హైదరాబాద్  నగరంలో మాయదారి దంపతులు చేసిన దోపిడీల స్టైల్‌ విని పోలీసులే అవాక్కయ్యారు. వీరిని ఆదివారం హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటకలోని బల్క్‌ ప్రాంతానికి చెందిన మహిళ అయేషా (25). కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌ చేరింది. మత్తుమందుకు బానిసగా మారింది. ఏడాది క్రితం సాజిద్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నిత్యం.. నివాసం మార్చుతూ ఉంటారు. ప్రతి రోజూ జనం రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఈ దంపతులు ఎంచుకుంటారు. 
 
ముందుగా అయేషా రంగ ప్రవేశం చేస్తుంది. దారెంట వెళ్తున్న మగవాళ్లను వచ్చీరాని తెలుగు, హిందీలో పిలుస్తుంది. పనుంది రమ్మంటూ పక్కకు తీసుకెళుతుంది. సమీపంలో ఎవరూ లేరని నిర్దారించుకున్న తరువాత ఆ పురుషుడిపై కలబడుతుంది. అతడి జేబులు వెతుకుతుంది. మెడలో, చేతివేళ్లకు ఉన్న బంగారు వస్తువులు లాక్కునేందుకు ప్రయత్ని స్తుంది. ఏ మాత్రం చిక్కినా వెంటనే వాటిని కొట్టేసి లోదుస్తుల్లో దాస్తుంది. ఎవరైనా ఎదురుతిరిగారో.. అంతే సంగతులు.. 
 
ఆమెకు కొద్దిదూరంలో కనిపించకుండా దాక్కున్న ఆమె భర్త సాజిద్‌ రంగప్రవేశం చేస్తాడు. తన భార్యపై అత్యాచారానికి ప్రయత్నించాడంటూ నానాయాగీ చేస్తాడు. పోలీసులకు ఫిర్యాదు ఇస్తానని బెదిరిస్తాడు. చివరికి అందినంత దోచుకుని.. మాయగాళ్లిద్దరూ అక్కడ నుంచి జారుకుంటారు. గతంలో అయేషాపై పలుమార్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో హబీబ్‌నగర్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్లు ఓపిక పడితే ముప్పై ఏల్లు నువ్వే సీఎం అన్నా.. వైఎస్ జగన్ ఒప్పుకోలే.. షబ్బీర్