Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కాటమరాయుడు''కి కలెక్షన్ల కష్టాలు తప్పవా? బుల్లితెరకు.. వీరుడొక్కడేకు లింకేంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా అజిత్ వీరమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగులోకి 'వీరుడొక్కడే' పేరుతో ఇప్పటికే డబ్బింగ్ సినిమాగ

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:40 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా అజిత్ వీరమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగులోకి 'వీరుడొక్కడే' పేరుతో ఇప్పటికే డబ్బింగ్ సినిమాగా రిలీజైంది. ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతున్నప్పటికీ.. కథను చాలామార్చామని దర్శకుడు పవన్‌తో సినిమా చేసేశాడు. కానీ అనూహ్యంగా ఓ ప్రముఖ ఛానల్ 'వీరుడొక్కడే' సినిమాను తమ ఛానల్‌లో ప్రతివారం సీరియల్‌గా ప్రసారం చేస్తోంది. 
 
దీంతో ఈ సినిమాను సీరియల్ రూపంలో తెలుగు జనం చూస్తేస్తున్నారు. ఫలితంగా కాటమరాయుడు సినిమాకు కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉందని సినీ జనం అంటున్నారు. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఫట్ కావడంతో కష్టంలో ఉన్న పవన్ కల్యాణ్‌కు కాటమరాయుడు మంచి కలెక్షన్లు ఇస్తాడనుకుంటే.. బుల్లితెరపై వీరమ్ సినిమా సీరియల్‌లా రావడంపై ఫ్యాన్స్ మధ్య ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
ఈ సీరియల్ ద్వారా 'కాటమరాయుడు' విడుదల అయ్యాక పవన్ సినిమాకు అజిత్ సినిమాకు పోలికలు పెడుతూ సామాన్య ప్రేక్షకుడు కూడ ఈ రెండింటి పై కామెంట్స్ చేసే ఆస్కారం ఉందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాలేదు. మరి బుల్లితెర ఎఫెక్టుతో కాటమరాయుడు ఏ మేరకు రాణిస్తాడో అనేది వేచి చూడాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments