Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విడాకులు - ఆనందంతో భార్య ఫోటో షూట్

Webdunia
మంగళవారం, 2 మే 2023 (19:26 IST)
పెళ్ళి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటారు. అలాంటి వారిలో తమిళ బుల్లితెర నటి, ఫ్యాషన్ డిజైనర్ షాలిని ఒకరు. 'మల్లుం మలరుం' అనే సీరియల్లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఈమె తాజాగా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరు కావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కేక్ కత్తిరించి మరీ ఒక వేడుకగా జరుపుకున్నారు. ప్రత్యేక ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. 
 
గతంలో రియాజ్ అనే వ్యక్తిని షాలిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయాలని నిర్ణయించుకుని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, ఇవి తాజాగా మంజూరయ్యాయి. దీంతో పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ షాలిని స్పందించారు.
 
'విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇదో సందేశం. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవడమే సరైనదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితాలను మీ చేతుల్లోకి తీసుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వండి. విడాకులు తీసుకోవడం ఒక వైఫల్యం కాదు. జీవితానికి ఇదొక మలుపు. ఇది సానుకూల మార్పులకు దారితీస్తుంది. 
 
ఒంటరిగా ఉండాలంటే ఎంతో ధైర్యం కావాలి. కాబట్టి ఒంటరిగా ఉండే మహిళందరికీ దీన్ని అంకితం చేసు న్నాను' అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె విడాకులలు అనే అక్షరాలను పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను చిం పేశారు. అలాగే, నాకు 99 సమస్యలు ఉన్నాయి. కానీ, భర్త ఒక్కటి కాదు' అంటూ రాసివున్న బోర్డును పట్టుకుని ఫోటోలు దిగి వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments