Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి కాబోతున్న గోవా బ్యూటీ... స్వయంగా వెల్లడి

Advertiesment
Ileana
, మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (11:13 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో గోవా బ్యూటీగా పేరుగాంచిన ఇలియానా ఇపుడు తల్లికాబోతుంది. అదేంటి.. పెళ్లి కాకుండానే తల్లికావడం ఏంటి అనేదే కదా మీ సందేహం. అవును.. నిజమే... ఇలియానా గర్భందాల్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అడ్వైంచర్ మొదలైందంటూ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. బుధవారం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్‌ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఇలియానా రెండు ఫోట్లను షేర్ చేసింది. ఒక ఫోటోలో అడ్వెంచర్ మొదలైంది.. అనే క్యాప్షన్‌తో ఉన్న టీషర్టుతో ఉండగా, మరో ఫోటోలో తన మెడలో వేలాడుతున్న ఓ పెండెంట్‌ను చూపించింది. 
 
ఆ పెండెంట్‌పై మామా (అమ్మ) అనే ఇంగ్లీష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు కింద కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ జతచేసింది. మై లిటిల్ డార్లింగ్ నినను కలిసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానటూ ఇలియానా తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇలియానాకు అభినందనలు చెబుతూ కామెట్స్ వెల్లువెత్తుతున్నాయి. పైగా, ఆ బిడ్డ తండ్రిని పరిచయం చేయాలంటూ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. 
 
కాగా, ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే, 2019లో వాళ్లు విడిపోయారు. ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్‌తో ఇలాయనా ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఈ ప్రచారంపై ఇలియానా స్పందించలేదు. ప్రస్తుతం తను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. కానీ, తండ్రి ఎవరన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా మౌనికతో జత ఓ వరమే అంటున్న మంచు మనోజ్‌