Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమా మౌనికతో జత ఓ వరమే అంటున్న మంచు మనోజ్‌

Advertiesment
manjoj-mounika
, మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (10:59 IST)
manjoj-mounika
మంచు మనోజ్‌, భూమా మౌనికను ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వివాహానికి మోహన్‌బాబు వ్యతిరేకమనీ, రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ ఆయన సమక్షంలోనే పెండ్లి జరిగింది. కాగా, పెండ్లికి ముందు ప్రీవెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరిగింది. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ తన ప్రేమ గురించి ఓ పాట రూపంలో వీడియో షూట్‌ చేశారు. ఆ పాట ఆమెకు అంకితం అన్నారు. అది ఈరోజు బయటకు విడుదల చేశారు.
 
webdunia
manoj, mounika
మనోజ్‌ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిలోనే మెట్లు ఎక్కుతూ లోపలకిరావడం అప్పటికీ మంచు లక్ష్మీ పెండ్లికూతురిగా మౌనికను తీర్చిదిద్దడం వంటి సీన్లు ఇందులో వున్నాయి. మనోజ్‌ పాట పాడుకూంటూ.. ఏం మనసో ఏం మనసో నా వెనుకో నా ఎదుటే నువ్వు లేక నిదురలేనందే తెల్లార్లు నసిగిందే... నిజమే.. నీ జతలో పడడటం వరమే.. జతలో పడితే జరిగే ప్రతీదీ మహిమే..అంటూ పాటకు అనుగుణంగా హావభావాలు వ్యక్తం చేశారు.
 
webdunia
Manchu Manoj, Mounika
వీరిద్దరి జంటను మెచ్చుకుంటూ మోహన్‌బాబు కుటుంబం, మంచు విష్ణు కుటుంబం, లక్ష్మీ కుటుంబంతోపాటు మౌనిక కుటుంబ సభ్యులుంతా వేడుకలో హాజరయి నిండుదనం కలిగించారు.  ప్రస్తుతం మనోజ్‌ ఓ మాస్‌ యాక్షన్‌ సినిమా చేశాడు. అది త్వరలో విడుదలకానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో ఛాన్స్...