Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా చిక్కిన నటి ప్రీతికా చౌహాన్

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2020 (09:05 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా ఈ డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సీబీఐ సూచన మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ దందాపై ఆరా తీయగా పెను సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ముఖ్యంగా, పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు ఈ డ్రగ్స్ దందాతో లింకు ఉన్నట్టు తేలింది. దీంతో బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పాటు.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరికొందరిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో రియా చక్రవర్తికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా, ఈ డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నట్టు అనుమానించిన మరికొందరు హీరోయిన్లకు కూడా ఎన్సీబీ సమన్లు జారీచేసి వారివద్ద విచారణ కూడా జరిగింది. వీరిలో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా న్నారు. మిగిలిన హీరోయిన్లలో దీపికా పదుకొణె, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా బుల్లితెర నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. కిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. 'దేవో కె దేవ్ మహాదేవ్', 'సంవాదన్ ఇండియా' వంటి సీరియల్స్‌లో నటించిన ప్రీతికా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రీతికాను విచారిస్తే మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తాయని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆమెను కోర్టులో హాజరుపరిచిన తర్వాత తమ కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments