త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నిర్మాతగా, రామ్ చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. అ.. ఆ.. హిట్‌తో ఊపు మీదున్న త్రివిక్రమ్ చేతిలో రెండు కథలు ఉన్నాయట. రెండు కథలు పవన్ కల్యాణ్‌కు నచ్చాయట. ఈ
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నిర్మాతగా, రామ్ చరణ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. అ.. ఆ.. హిట్‌తో ఊపు మీదున్న త్రివిక్రమ్ చేతిలో రెండు కథలు ఉన్నాయట. రెండు కథలు పవన్ కల్యాణ్‌కు నచ్చాయట. ఈ రెండింటి కథల్లో చెర్రీ హీరోగా ఓ సినిమా, పవన్ హీరోగా ఓ సినిమాలో నటించనున్నారని తెలిసింది.
అందుకే, ఈ రెండు కథలనూ రాంచరణ్‌కి చెప్పమని త్రివిక్రమ్‌ని పవన్ కోరాడు. తనకెలాగో రెండు కథలూ నచ్చాయి కాబట్టి, వాటిలో రామ్ చరణ్‌కి ఏది నచ్చితే ఆ కథను తాను ప్రొడ్యూస్ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం.
రామ్ చరణ్ ఇప్పటికే ధృవ చేస్తున్నాడు. చిరంజీవి 150వ సినిమా నిర్మాత కూడా చరణే. మరి డేట్స్ కుదిరి చరణ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో, అసలు కథ నచ్చుతుందో లేదో కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ చరణ్ సినిమా చేయడం ఆలస్యం అయినా, ఆ రెండింటిలో కథ ఎంచుకుంటే, మిగిలిన కథతో పవన్ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా ఉంది.