Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాయకి'లో త్రిష నటన అందరి మన్ననలు అందుకుంటుంది...

ఇంతవరకు వచ్చిన హార్రర్‌ చిత్రాలకు భిన్నంగా కొత్తరకమైన హారర్‌ కామెడీ నేపథ్య కథాంశంతో 'నాయకి' చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని దర్శకుడు గోవి వెల్లడించారు. త్రిష టైటిల్‌ పాత్రధారిణిగా రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌

Webdunia
బుధవారం, 13 జులై 2016 (14:51 IST)
ఇంతవరకు వచ్చిన హార్రర్‌ చిత్రాలకు భిన్నంగా కొత్తరకమైన హారర్‌ కామెడీ నేపథ్య కథాంశంతో 'నాయకి' చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని దర్శకుడు గోవి వెల్లడించారు. త్రిష టైటిల్‌ పాత్రధారిణిగా రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారంనాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ''చిన్న సినిమాగా దీనిని మొదలుపెట్టాం. అయితే పెద్ద సినిమా అయింది. నిర్మాత గిరిధర్‌, కథానాయిక త్రిషల సహకారంతో అనుకున్నవిధంగా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది రెగ్యులర్‌ హార్రర్‌ చిత్రం కాదు. రెట్రో హార్రర్‌ కామెడీగా దీనిని మలిచాం'' అని చెప్పారు.
 
నిర్మాత గిరిధర్‌ మాట్లాడుతూ, ''నిర్మాతగా నా రెండవ చిత్రమిది. సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. దర్శకుడు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. సినిమా పట్ల మేమంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం'' అని చెప్పారు. 
 
ఈ చిత్రం గురించి ఎన్‌.శంకర్‌, మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ, చక్కటి అభిరుచితో నిర్మాత, దర్శకులు తీసిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, ''సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాటలు, రీ-రికార్డింగ్‌ చాలాబాగా కుదిరాయి. త్రిషతో ఓ పాట కూడా పాడించాం. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

JanaSena: వైఎస్ఆర్సీపీకి తీవ్ర ఎదురుదెబ్బ- జేఎస్పీలో ఒంగోలు, తిరుపతి నేతలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments