Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిబాబు.. పందిపిల్ల.. టైటిల్ 'అదుగో' ఖరారు

'అల్లరి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విలక్షణమైన దర్శకుడు, నటుడు రవిబాబు ఈసారి ఎవరూ ఊహించనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు కుక్కలు, కోతులు, ఏ

Webdunia
బుధవారం, 13 జులై 2016 (14:46 IST)
'అల్లరి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విలక్షణమైన దర్శకుడు, నటుడు రవిబాబు ఈసారి ఎవరూ ఊహించనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు కుక్కలు, కోతులు, ఏనుగులు, ఈగలు వంటి జీవులను పెట్టి సినిమాలు తీశారు. కానీ రవిబాబు స్టైలే వేరు. ఏకంగా పందిపిల్లతో సినిమా తీస్తున్నారు. నిజంగా ఇప్పటివరకు ఇలాంటి సాహసాన్ని ఎవరూ చేసుండరు. 
 
పందిపిల్ల ముఖ్య పాత్రగా తెరకెక్కే ఈ చిత్రంలో అభిషేక్, నాభ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ''అదుగో'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రవిబాబుకి 'అ' సెంటిమెంట్ ఎక్కువని అందరికి తెలిసిందే. అందుకే ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు సినీవర్గాలు అంటున్నాయి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సపోర్టుతో ఇలాంటి విలక్షణ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రవిబాబు సిద్ధమయ్యారు. 
 
డి.సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ స్క్రిప్ట్‌తో సినిమా రూపొందించడంలో ఎదురైన అనేక సవాళ్ళను దాటి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల గురించి వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం

Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు (video)

రాత్రికి రూ. 10 వేలు అంటే వెళ్లింది, తెల్లారాక డబ్బు ఇమ్మంటే గొంతు కోసాడు

ఎవర్నైనా వదిలేస్తా కానీ ఆ లంగా గాడిని వదలను: మద్యం మత్తులో వర్థమాన నటి చిందులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments