ఆ శృంగార సన్నివేశాలు చూసి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు.. కానీ.. : హీరోయిన్ త్రిప్తి డిమ్రి

ఠాగూర్
శుక్రవారం, 1 మార్చి 2024 (16:02 IST)
సందీవ్ వంగా దర్శకత్వంలో గత యేడాది వచ్చిన చిత్రం "యానిమల్". ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి నటించారు. సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ హాట్ హాట్ శృంగార సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించారు. దీంతో సూపర్ హిట్ కావడమే కాకుండా, పంపిణీదారులకు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే, ఇందులో శృంగార సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై త్రిప్తి డిమ్రి స్పందించారు. 
 
'దర్శకుడు సందీప్‌ వంగా కథ నరేట్ చేసే సమయంలోనే నాది చాలా చిన్న పాత్ర అని స్పష్టంగా చెప్పారు. ఆ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది ఎప్పటికీ చేయలేం. ఎప్పుడూ సౌకర్యవంతమైన పాత్రలే చేయాలని నేను అనుకోను. 
 
'యానిమల్‌'లో నేను నటించిన శృంగార సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. సినిమాకు ఆ సీన్‌ ఎంత ముఖ్యమో వారికి వివరించాను. గతంలో నా తొలి చిత్రం విడుదల తర్వాత మా నాన్న నేను నటినని అందరితో గర్వంగా చెప్పాలనుకున్నారు. అప్పుడు నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ చిత్రంతో నన్ను అందరూ గుర్తుపడుతున్నారు' అని చెప్పారు.
 
ఈ 'యానిమల్' బ్యూటీ ప్రస్తుతం 'మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌', 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments