Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

దేవీ
మంగళవారం, 13 మే 2025 (17:10 IST)
Satharaj, Rajesh
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న మూవీస్‌కు ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో అందరినీ ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్‌’ అనే చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి.
 
ప్రస్తుతం ‘త్రిబాణధారి బార్బరిక్‌’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలె సినిమాను చూసిన టీం ఎంతో సంతోషంగా ఉంది. చిత్రం అద్భుతంగా వచ్చిందన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. పైగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగా రీచ్ అయ్యాయి. సత్య రాజ్ చేస్తున్న ప్రమోషన్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. కంటెంట్ మీద, సినిమా మీదున్న నమ్మకంతో సత్య రాజ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
 
‘అనగా అనగా కథలా’ అనే పాటతో సత్య రాజ్ ఎమోషనల్‌గా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను నెగెటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్‌ ద్వారా సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుందని సమాచారం. ఓ మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే సరైన విడుదల తేదీని టీం ప్రకటించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments