Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Advertiesment
Hari Hara- Pavan

దేవీ

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (15:08 IST)
Hari Hara- Pavan
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'  చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినీ అభిమానులంతా ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు, ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నారు మరియు విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ఈ వేసవిలో వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.
 
దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ గత ఏడు నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్ మొదలుకొని మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడం వరకు ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చేయడంలో జ్యోతి కృష్ణ పాత్ర కీలకం.
 
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు.
 
'హరి హర వీరమల్లు' చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
 
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకులు. కరోనా మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైనప్పటికీ.. చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఎ.ఎం. జ్యోతి కృష్ణ, ఎక్కడా రాజీ పడకుండా వేగంగా 'హరి హర వీరమల్లు' సినిమాని పూర్తి చేస్తున్నారు.
 
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు.
 
పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్, డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం, మే 9న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ - లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్