Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో 'చెక్' సినిమా

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (14:58 IST)
హీరో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్". రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లింప్స్ ఆదివారం విడుదల చేశారు. "జైలులో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు" అనే వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. 
 
ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్, కాస్పరోవ్‌తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది.
 
ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్  మాట్లాడుతూ, నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్  ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి - కళ్యాణి మాలిక్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇదే. ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు.
 
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ, ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది'' అని చెప్పారు. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన  తారాగణం. 
 
ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్ : వివేక్ అన్నామలై, ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత :  వి.ఆనంద ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments