Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నితిన్ ప్రసన్న హీరోగా థ్రిల్లర్ మూవీ “A”

Advertiesment
Nithin Prasanna
, ఆదివారం, 3 జనవరి 2021 (11:59 IST)
ఇటీవ‌ల థ్రిల్లర్ జోనర్లో రూపొందిన చిత్రాలు ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అటువంటి కాన్సెప్ట్‌తో మ‌రో చిత్రం రాబోతుంది. దానికి `ఎ` అని పేరు పెట్టారు. ఇటీవ‌లే సెన్సార్ కూడా పూర్త‌యింది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అసరాని హీరోయిన్‌గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెరిగాయి.
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు 5 లక్షల మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఒక చిన్న సినిమాకు ఇంత భారీగా ఆదరణ, క్రేజ్ రావడం చూస్తుంటే "A" చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని అర్థం అవుతుంది. డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని దానికి "A" (AD INFINITUM) టీజర్ బెస్ట్ ఎగ్జామ్‌పుల్ అని చెప్పవచ్చు. 
 
యుగంధర్ ముని డిఫరెంట్ పాయింట్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్ ప్రసన్న మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ పాటలు రాయగా దీపు, పావని ఆలపించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ని సాధించింది. ఈ చిత్రం జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.
 
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ, థ్రిల్లర్ జోనర్లో రూపొందిన "A" (AD INFINITUM) చిత్రం సరికొత్త కాన్సెప్టుతో డిఫరెంట్ వేలో రూపొందించాం. హైలి టాలెంటెడ్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు ఈ సినిమా చూసి అభినందించారు.. అలాగే సెన్సార్ సభ్యులు కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా డిఫరెంట్ పాయింట్ తో సరికొత్త థ్రిల్లర్ జోనర్లో ఏ సినిమా తీశారు.. చాలా బాగుంది.. అని ప్రశంసించారు.. సినిమా చాలా బాగా వచ్చింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 
 
సినిమాటోగ్రాఫర్  ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి వస్తున్న "క్రాక్"... రిలీజ్ డేట్ ఫిక్స్