Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జా ఆరోపణల కేసు.. రానా, సురేష్ బాబులకు సమన్లు జారీ

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (00:22 IST)
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి, ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు, భూకబ్జా ఆరోపణల కేసులో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. తనకు చెందిన భూమిని ఖాళీ చేయాలని తండ్రీ కొడుకులు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ దాఖలు చేసిన కేసులో 'బాహుబలి' నటుడు రానాతో పాటు సురేష్ బాబు పేరు కూడా వుంది. 
 
ఈ నేపథ్యంలో నగరంలోని నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్లు ​​జారీ చేసింది.
 
షేక్‌పేటలోని వివాదాస్పద భూమిని 2014లో సురేష్ బాబు తనకు లీజుకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లీజు ముగియడంతో, సురేశ్ బాబు తనకు ఆస్తిని రూ.18 కోట్లకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడని, డీల్ కుదిరిందని ఆరోపించారు.
 
ఈ డీల్‌కు సంబంధించి 5 కోట్ల రూపాయలు చెల్లించగా, సేల్ - రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి సురేష్ బాబు పట్టించుకోలేదని ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకముందే సురేష్ బాబు ఆస్తిని తన కొడుకు రానా పేరు మీదకి బదలాయించాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments