Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథతో కార్తికేయ 'బెదురులంక'

Advertiesment
bedurulanka 2012
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (18:13 IST)
హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన కొత్త చిత్రం "బెదురులంక 2012". గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కించారు. మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చగా, రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
లంక గ్రామాల్లో ఒకటైన బెదురులంక అనే గ్రామంలో 2012లో నడిచే కథ. ఆ సమయంలో యుగాంతం జరుగనున్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంతో ముడిపడిన సంఘటనలతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ టీజర్‌ను బట్టి అర్థమవుతుంది. 
 
హీరో హీరోయిన్ ప్రేమ వ్యవహారం, డ్రామా కంపెనీకి సంబంధించిన సందడిని కలుపుకుంటూ ఈ కథ సాగుతుంది. లవ్, యాక్షన్, కామెడీపై ఈ టీజర్‌ను కట్ చేశారు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్‌లు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 కంటెంట్ ఫుటేజ్