Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

skn producer
ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (16:52 IST)
తాను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‍బై చెబుతున్నట్టు నటుడు పోసాని కృష్ణమురళి చేసిన ప్రకటనపై సినీ నిర్మాత ఎస్కేఎన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమార్హులు కాదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని... పగటి వేషం వేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాల గురించి, పిల్లల గురించి నీచాతి నీచంగా మాట్లాడరని, అభిమానుల మనసులను సైతం గాయపరిచారని వ్యాఖ్యానించారు. 
 
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న పోసానిపై ఇపుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన రాజకీయాలను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై ఏ పార్టీని తిట్టనని, ఏ పార్టీని పొగడనని ఆయన అన్నారు. తన కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
 
మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు. ఈ కారణంగా ఆయనపై పలు చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పోసాని నుంచి కీలక ప్రకటన వెలువడటం గమనార్హం.
 
దీనిపై సినీ నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ మీరు నటించే ముందు... తమ అభిమాన నాయకుడి గురించి, వారి ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన సంస్కార హీనమైన, నీచమైన మాటలకు చింతిస్తున్నానని లేదా క్షమించండని అడిగి ఉంటే... మీ మాటలను నమ్మాలనిపించేదని అన్నారు. మీరేదో పొరపాటున ఒకసారి మాట్లాడిన వ్యక్తి కాదని మండిపడ్డారు. ఎన్నోసార్లు చాలా నీచంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
 
అభిమానుల మనసును మీరు ఎంతో బాధ పెట్టారని ఎస్కేఎన్ అన్నారు. ఛీ ఇవేం మాటలు అంటూ అందరూ చెవులు మూసుకునేలా చేశారని మండిపడ్డారు. ఎవరి కుటుంబాలైనా, ఎవరి పిల్లలైనా ఒక్కటేనని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని... కానీ వ్యక్తిగతంగా దిగజారిపోయి కుటుంబాల మీద కామెంట్స్ చేసిన మీలాంటి వాళ్లు ఏ మాత్రం క్షమార్హులు కారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments