తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

డీవీ
శుక్రవారం, 22 నవంబరు 2024 (16:43 IST)
Naga Chaitanya, Sai Pallavi
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'తండేల్' మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్ గా వుంది. ప్లజెంట్ మెలోడీలను క్రియేట్ చేయడంలో మాస్టర్ అయిన దేవి శ్రీ ప్రసాద్ మెస్మరైజింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. ఇది లిజనర్స్ మనసులో నిలిచిపోయేలా వుంది.  
 
హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. లిరికల్ వీడియో ద్వారా లీడ్ పెయిర్ బాండింగ్ అద్భుతంగా చూపించారు. శ్రీమణి రాసిన లిరిక్స్, తన ప్రేమికురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న హీరో భావోద్వేగాలకు కవితాత్మకంగా ప్రజెంట్ చేశాయి. జావేద్ అలీ సోల్ ఫుల్ వోకల్స్ ట్రాక్‌ కు మరింత డెప్త్ ని యాడ్ చేశాయి.
 
లిరికల్ వీడియో లీడ్ రోల్స్ జర్నీని, వారి ప్రేమకథను విజువల్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి స్క్రీన్ పై ప్లజెంట్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. వారి నేచురల్ బాండింగ్, ఆన్-స్క్రీన్ పెయిరింగ్ ప్రత్యేకంగా నిలిచాయి. తప్పకుండా బుజ్జి తల్లి సాంగ్ అఫ్ ది ఇయర్ కానుంది. ఇది తండేల్ మ్యూజిక్ ప్రమోషన్‌లకు చార్ట్‌బస్టర్ స్టార్ట్ ని ఇచ్చింది.
 
అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల స్ఫూర్తితో రూపొందింది.  
తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

పోలీసులు వచ్చారని నదిలోకి దూకేసిన పేకాటరాయుళ్లు.. ఒక వ్యక్తి మాత్రం?

Yadagirigutta: రూ.1.90 లక్షలు లంచం డిమాండ్ చేసి యాదగిరి గుట్ట ఈఈ చిక్కాడు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments