Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (16:02 IST)
SKN
ప్రముఖ సినీ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై బేబీ నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. ఆయన డ్రామాలు నమ్మశక్యం కావట్లేదన్నారు. రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు పోసాని మాటల్లో నిజమెంత అనేలా కామెంట్లు చేశారు. 
 
"అందరికీ పోసాని మాటలు గుర్తుకొస్తున్నాయి. రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని డ్రామా చేసేముందు.. మా అభిమాన నాయకుడి గురించి, ముఖ్యంగా వారి ఇంట్లోని పసిపిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని వ్యాఖ్యలకు చింతిస్తున్నాను అనో .. లేదా క్షమించండి అనో అడిగి ఉంటే, మీ మాటలు నమ్మాలని అనిపించేది. 
 
ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు కదా మీరు.. ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడిన మాటలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అభిమానుల మనసు చాలా బాధపడింది. ఈ మాటలు వినలేక చెవులు మూసుకునేలా మమ్మల్ని చేశారు. 
 
మీ ఒక్కరికే కాదు సార్, అందరివి కుటుంబాలే కదా.. ఎవరి పిల్లలైనా సరే పిల్లలే.. రాజకీయాల్లో విమర్శలు అనేవి చాలా సహజం కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు మాట్లాడడం, కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారిని క్షమించకూడదు" అంటూ ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
posani krishnamurali
 
ఇకపోతే పోసాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇక తాను బతికి ఉన్నన్ని రోజులు.. జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. వందశాతం తన కుటుంబం, పిల్లలు, భార్య కోసమే రాజకీయాలకు రాజీనామా చేశానని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments