ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్, హోం క్వారెంటైన్లో 'వకీల్ సాబ్' ప్రొడ్యూసర్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (22:43 IST)
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో ఆయన హోం క్వారెంటైన్లోకి వెళ్లిపోయారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజై విజయవంతంగా ముందుకు దూసుకువెళుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు యూనిట్ సభ్యులతో కలసి ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. ప్రేక్షకులతో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. థియేటర్లలో ఆడియెన్సుతో కలిసి షోలు కూడా చూశారు.
 
కాగా ఇప్పటికే చిత్రంలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారు. నెగటివ్ అని తేలడంతో ఆమె ప్రమోషన్సులో పాల్గొన్నారు. మరోవైపు యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా వుందని తెలియడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం హోం క్వారెంటైన్లోకి వెళ్లిపోయారు.
 
మొత్తమ్మీద సక్సెస్ ఇచ్చిన వకీల్ సాబ్ ను కరోనావైరస్ వెంటాడుతోంది. కాగా తనను ఇటీవలి కలిసినవాళ్లంతా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని దిల్ రాజు కోరారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments