Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు మాదికాదు.. ప్రమాదానికి కారణం అభిరాం కాదు : దగ్గుబాటి సురేష్

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (14:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదానికి గురయ్యాడంటూ తెలుగు మీడియాలో గురువారం వార్తలు వచ్చాయి. పైగా, ఈ ప్రమాదం నుంచి అభిరామ్ తృటిలో తప్పించుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రమాదానికి అభిరామ్ రాంగ్ రూట్‌లో వెళ్ళడం వల్లే జరిగిందని స్థానికులు అంటున్నారు. ఇదే అంశంపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కూడా ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 
 
అయితే, మీడియాలో వస్తున్న కథనాలపై అభిరామ్ తండ్రి సురేశ్ బాబు స్పందించారు. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడనే వార్తలను ఆయన ఖండించారు. యాక్సిడెంట్ చేసింది తనకు కుమారుడు అభిరామ్ కాదని... ఆ కారు కూడా తన కుమారుడిది కాదని చెప్పారు. 
 
మరోవైపు, రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు గురువారం ప్ర‌మాదానికి గురైంది. ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

Amaravati : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.. ఏపీ సర్కారు

ఒకే రోజులో 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో మరో క్యాన్సర్ ఆస్పత్రి.. తుళ్లూరులో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments