Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ''విజేత"ను కొనుగోలు చేయని డిస్ట్రిబ్యూటర్స్...

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం విజేత. సాయి కొర్రపాటి నిర్మాత కాగా, రాకేష్ శశి దర్శకుడు. అయితే, ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది.

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:05 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం విజేత. సాయి కొర్రపాటి నిర్మాత కాగా, రాకేష్ శశి దర్శకుడు. అయితే, ఈ చిత్రం ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈనెల 24వ తేదీన ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'అప్పట్లో చిరంజీవిగారు వ‌రుస‌గా యాక్షన్ సినిమాలే చేస్తుంటే.. విజేత క‌థ‌ను సినిమాగా ఎందుకు తీయాల‌ని జంధ్యాల‌గారితో సహా మేమంతా ఆలోచించాం. ఏది ఏమైనా చిత్రాన్ని పూర్తి చేసి కాస్త భ‌యంగానే విడుద‌ల చేయడం జరిగింది. ఫ్యామిలీ డ్రామా అని.. నా డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎవ‌రూ ఆ సినిమాను తీసుకోలేదు. కానీ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే పేరుతో క‌ల్యాణ్ సినిమా చేయ‌డం చాలా సంతోషం. 
 
కొత్త టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే నిర్మాత సాయి కొర్రపాటిగారు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి క‌ల్యాణ్‌దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వ‌చ్చినా ఒకే ఒక ధైర్యం.. మెగాభిమానులే. అభిమానానికి టాలెంట్‌ను యాడ్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే క‌ల్యాణ్ దేవ్ కూడా త‌న టాలెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వ‌స్తార‌ని భావిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments