ఐశ్వ‌ర్య, ధ‌నుష్‌ల విడాకులు అబద్దం అంటున్న టాలీవుడ్ జనం (video)

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:46 IST)
Aishwarya and Dhanush
ఇప్పుడు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య, అల్లుడు ధ‌నుష్ గురించి హాట్ టాపిక్‌గా మారింది. ఈరోజే ఉద‌య‌మే ట్విట్ట‌ర్ ఐశ్వ‌ర్య పేరుతో తాము నేటికి 18 ఏళ్ళ క్రిత‌మే స్నేహితుడిగా జీవిత భాగ‌స్వామ్యం కావ‌డానికి అంకురార్ప‌ణ జ‌రిగిందంటూ ఓ పోస్ట్ వ‌చ్చింది. ఆ  త‌ర్వాత దీనిపై ప‌లుర‌కాలుగా ప‌లువురు స్పందించారు. ధ‌నుష్ ఇన‌స్ట్రాలో, ఐశ్వ‌ర్య ట్విట్ట‌ర్‌లో త‌మ వైవాహిక జీవితం ముగిసింద‌నీ, ఇష్ట పూర్వ‌కంగా తాము విడిపోతున్నామంటూ మీ ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్ చేశారు. 
 
అయితే ఇందులో నిజ‌మెంత అనేది ఇంకా తెలియాల్సివుంది. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌, స‌మంతలు కూడా ఇలాగే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇక ఇలా వుంటే, ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ల విష‌య‌మై గ‌త కొంత‌కాలంగా విబేదాలు వున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

 
అయితే దీనిపై ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు. సూప‌ర్ స్టార్ ఫ్యామిలీకి చెందిన కుటుంబం ఇలా చేయ‌ద‌నీ, వారు విడిపోతే అంద‌రికీ తెలిసేలా చేస్తార‌ని పేర్కొన్నారు. ర‌జ‌నీకాంత్‌ను ఐకాన్ తీసుకున్న ధ‌నుష్ తొంద‌ర‌ప‌డి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోర‌ని ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్ తెలియ‌జేస్తున్నారు. ప్ర‌తి కుటుంబ‌లో గొడ‌వ‌లు మామూలేన‌నీ, సెల్ర‌బిటీలు క‌నుక సోష‌ల్‌మీడియాలో వ‌చ్చినదానిలో ఎంత నిజ‌మో తెలియ‌దని, త్వ‌ర‌లో వారు అధికారికంగా ప్ర‌క‌టిస్తేనే దీనిపై మాట్లాడాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. చూద్దాం ముందుముందు ఏం జ‌రుగుతుందో..?

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments