Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది చూస్తే మహేష్ బాబు కుళ్లుకుంటాడు... ఎన్టీఆర్ లారీ అక్షింతలు చల్లుతాడు...

తను తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తీస్తున్నారని అనుకున్నారేమోగానీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌ను వాడారు. లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (12:47 IST)
తను తీయబోయే చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తీస్తున్నారని అనుకున్నారేమోగానీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌ను వాడారు. లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ... ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే 100 రెట్లు ఎక్స్‌టార్డినరీ స్క్రీన్ ప్రెజెన్స్ వుందనీ, ఆయన్ని చూస్తే ప్రిన్స్ మహేష్ బాబు సైతం కుళ్లుకుంటారని ట్వీట్ చేశారు. 
 
లక్ష్మీస్ వీరగ్రంథంలో వీరగంధం పాత్రలో కేతిరెడ్డి నటిస్తే చిత్రం బ్లాక్‌బస్టర్ ఖాయమవుతుందని వర్మ పేర్కొన్నారు. వీపు సుందరితో కేతిరెడ్డి నటిస్తుంటే దాన్ని చూసి స్వర్గీయ ఎన్టీఆర్ సైతం ఉబ్బితబ్బిబ్బయి ఓ లారీడు అక్షింతలు తీసుకుని వచ్చి ఆయనపై చల్లుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరికను ఓ స్థాయిలో ఎత్తేశారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రాన్ని వాడుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాహుబలి అనీ, ఆయన చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురుస్తుందని వెల్లడించారు. వ్యవహారం చూస్తుంటే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంపై కుళ్లుకుంటున్నట్లు కనబడటం లేదూ...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments