Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో వద్ద చెమట కంపు.. విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (10:58 IST)
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లో కూడా మెరుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అగ్ర హీరోల సరసన నటించింది. కానీ ఒక హీరోతో మాత్రం రకుల్ చాలా ఇబ్బంది పడిందట. సదరు హీరోతో లొకేషన్‌లో రొమాన్స్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు... అతని నుంచి వచ్చే చెమట కంపును భరించలేకపోయేదాన్నని రకుల్ తెలిపింది. 
 
ఆ విషయాన్ని అతనికి చెప్పేందుకు భయమేసి... చివరకు తానే దూరంగా వెళ్లి పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. తనను చూసి యూనిట్‌లోని చాలామంది కూడా అలాగే చేశారని తెలిపింది. అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
 
మరోవైపు తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసిన రకుల్.. మొన్నీమధ్యే నాగార్జున లాంటి సీనియర్స్‌తో కూడా కలిసి నటించింది. ఇప్పుడు తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది రకుల్. ఇదిలా ఉంటే తనకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉందని చెప్పి సంచలనం సృష్టించింది రకుల్. తన ఫిజిక్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ భామ.
 
తిండి విషయంలో కడుపు కాల్చుకునే అలవాటు తనకు లేదని.. ఇష్టమైనవన్నీ తింటూనే దానికి సరిపడా జిమ్ చేస్తానని రకుల్ చెప్పుకొచ్చింది.  ఇక తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది రకుల్. ఆరడుగుల ఎత్తుండాలని.. తెలివైన వాడై ఉండాలని.. అలాంటివాడు దొరికే వరకు ఎదురు చూస్తానని చెబుతుంది రకుల్. ఇక ఇప్పుడున్న హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే పిచ్చి అని చెప్పింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments