ఆ షో నుంచి జబర్దస్త్ వినోద్‌ తప్పుకున్నాడా?

గురువారం, 3 అక్టోబరు 2019 (12:26 IST)
చమ్మక్ చంద్రకు జోడీగా జబర్దస్త్ స్కిట్లకు సరిపోయే కమెడియన్ వినోద్ ప్రస్తుతం ఆ షో నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ (వినోదిని) ఒకడు. ఇటీవల కాలంలో ఆయన 'జబర్దస్త్' స్టేజ్ పై కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ తరఫున ప్రచారం చేసిన కారణంగానే ఆయనను పక్కన పెట్టేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 
 
ఈ విషయంపై తాజాగా వినోద్ స్పందించాడు. జగన్ తరఫున ప్రచారం చేసినందుకు తనను పక్కనబెట్టలేదని.. ఆ సమయంలో షూటింగుకి తగిన డేట్స్ తాను ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఇందులో నిర్వాహకుల తప్పేమీ లేదు. అంతేగాకుండా తాను ఇటీవల జరిగిన గొడవుల్లో గాయానికి గురికావడం.. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడం కారణంగా నటించలేకపోయానని వెల్లడించాడు. త్వరలో పూర్తిగా కోలుకుని 'జబర్దస్త్' వేదికపై కనిపిస్తానని స్పష్టం చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గద్దలకొండ ఆది అంటే గజగజ వణకాలా..? హైపర్ ఆది (video)