Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (12:56 IST)
బాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? డైరెక్టర్ అశోక్. తెలుగులో ఆకాశరామన్న, పిల్ల జమీందార్, భాగమతి చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. భాగమతితో బిగ్ సక్సెస్ సాధించిన అశోక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు.
 
ఈ చిత్రాన్ని హిందీలో దుర్గావతిగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో భూమీ పడ్నేకర్ టైటిల్ రోల్ చేస్తోంది. చిత్రీకరణ తుది దశలో ఉంది. అక్షయ్ కుమార్ సమర్పణలో భూషణ్ కుమార్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ సినిమా ఇంకా ఫినిష్ కాలేదు.. ఇంకా రిలీజ్ కాకుండానే బాలీవుడ్లో మరో ఆఫర్ దక్కించుకున్నాడు.
 
అయితే.. ఈ ప్రాజెక్ట్ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇంతకీ.. ఏంటా ప్రయోగం అంటే ఇది పూర్తిగా మూకీ సినిమా. అంటే.. నటనే తప్ప డైలాగ్స్ ఉండవు. గతంలో కమల్ హాసన్ చేసిన పుష్పక విమానం సినిమా తరహాలో ఉంటుందన్న మాట. ఈ సినిమాని తెలుగులో చేయాలి అనుకున్నారు. వెంకీతో చేయడానికి ప్లాన్ చేసారు కానీ.. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
 
ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సోహమ్‌ షా, నుష్రత్, ఓంకార్‌ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇది కూడ ఒక ప్రముఖ ఓటీటీ కోసం రూపొందిస్తున్న సినిమా అని సమాచారం. మరి.. ఈ చిత్రాన్ని హిందీలోనే తీస్తారా..? లేక సౌత్ లాంగ్వేజెస్‌లో కూడా తీస్తారా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments