Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి సినీ నటి హేమ.. పవన్‌పై ప్రశంసలు.. చెవిలో ఏం చెప్పారంటే..? (video)

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:49 IST)
సినీ నటులు రాజకీయ పార్టీల్లో చేరడం కొత్తేమీ కాదు. తాజాగా నవ్వులు పూయించి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టే సినీ నటి హేమ కాషాయ కండువా కప్పుకున్నారు. నెల్లూరు సభ వేదికగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు నవ్వులు పూయించాయి. 
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కూడా సరిగ్గా పలకక పోవడం, తర్వాత దాన్ని కవర్ చేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభికుల్లో నవ్వులు తెప్పించాయి. ఇదిలా ఉంటే, తిరుపతిలో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికా.. లోక్‌సభ ఎన్నికా అన్నదానిపై కూడా ఆమెకు క్లారిటీ లేకుండా పోయింది. 
 
అంతేగాక సభలో ఆమె 'వకీల్ సాబ్' సినిమా గురించి ప్రస్తావించి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. ప్రధాని మోదీ గురించి మర్చిపోయారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న బీజేపీ నేత... మోదీ గురించి మాట్లాడాలని చెవిలో చెప్పారు. అప్పుడు ఆమె ప్రధాని మోదీ కార్యక్రమాల గురించి ఏకరువు పెట్టారు. ఇలా ఆమె కన్ఫ్యూజన్‌తో సభ నవ్వులతో హోరెత్తింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments