Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (15:46 IST)
బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీలో తను లేనంటూ నటి హేమ అవాస్తవం చెప్పారని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో రైడ్ జరిగినప్పుడు హేమ కూడా ఉన్నట్టు మీడియాకు సమాచారం అందింది. కానీ హేమ మాత్రం తను లేనని, అక్కడి ఫామ్‌హౌస్ నుంచి వీడియో తీసి అది హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ అని అబద్ధం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.
 
తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ... రేవ్ పార్టీలో హేమ ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. దాడి సమయంలో హేమ కూడా పార్టీలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పాడు. దాడి సమయంలో పట్టుబడ్డ హేమ, ఫామ్‌హౌస్‌లో ఎలా వీడియో తీశారనే దానిపై కూడా విచారిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్న వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. వారిలో హేమ కూడా ఒకరని పోలీసు కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు.
 
దీంతో దాడి సమయంలో తాను లేనని, పార్టీకి రాలేదని చెబుతున్న నటి హేమ ఇరకాటంలో పడ్డట్లయింది. పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులిచ్చి విచారణ జరుపుతామన్నారు. వారిలో హేమకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments